మహేశ్‌బాబు - రాజమౌళి మూవీ ‘వారణాసి’ ఈవెంట్ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. 20 రోజులకు పైగా ఏర్పాట్లు కొనసాగాయి. 1000 మందికి పైగా వర్కర్లు 24 గంటల పాటు పని చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎల్‌ఈడీలను ప్రత్యేకంగా తీసుకొచ్చి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. శ్రుతిహాసన్ పెర్ఫామెన్స్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా, మహేశ్‌బాబు తదితరుల ఎంట్రీ దగ్గరి నుంచి చివరి వరకూ ఏది ఎలా జరగాలో అన్నీ జక్కన్న పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.