నిబంధనలు ప్రకటించిన ఏసీపీ
NEWS Dec 31,2025 04:31 pm
పెద్దపల్లి: ఏసీపీ గజ్జి కృష్ణ ప్రజలకు సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 సందర్భంగా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. స్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి జంక్షన్ వద్ద పోలీసు బందోబస్తు, ప్రతి వార్డులో పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.