గద్దర్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
NEWS Dec 31,2025 12:01 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 గద్దర్ (నంది) అవార్డును పొందిన పొట్టేలు సినిమా దర్శకుడు మోతుకూరి సాహిత్ గౌడ్‌ను నిర్మల్ జిల్లాలో ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా చలనచిత్ర–టీవీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కళాకారులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముద్దుబిడ్డ అయిన సాహిత్ గౌడ్ ప్రతిభను ప్రశంసిస్తూ ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువాతో సన్మానం చేశారు.