కేటీఆర్ కొత్తగూడెం జిల్లా పర్యటన ఖరారు
NEWS Dec 30,2025 01:15 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జనవరి 7న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన జిల్లా సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకుని, ఉదయం జరిగే కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లో వెల్లడించారు.