అరుదైన రికార్డు దిశగా కింగ్ కోహ్లీ
NEWS Dec 30,2025 02:56 pm
భారత క్రికెట్ స్టార‍్ విరాట్ కోహ్లీ 28,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయికి కేవలం 25 పరుగుల దూరంలో నిలిచాడు. జనవరి 11న న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఈ ఘనత సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సంగక్కర మాత్రమే అందుకున్నారు. కోహ్లీ 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు సాధించాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరితే మరో అరుదైన రికార్డు సాధించినట్టే. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.