మహా పోచమ్మను దర్శించుకున్న డా.వేణుగోపాల్
NEWS Dec 30,2025 03:05 pm
సారంగాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యస్థలం మహా పోచమ్మ ఆలయాన్ని ప్రముఖ వైద్యుడు డా. వేణుగోపాల కృష్ణ సందర్శించారు. ఆయనకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తూ ఇటీవల రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నంది పురస్కారాలు అందుకున్న వేణుగోపాల కృష్ణ మరింత సేవలు అందించాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.