జిల్లాలో నేరాలు తగ్గాయి: SP జానకి
NEWS Dec 30,2025 03:02 pm
ఈ ఏడాది జిల్లాలో నేరాల శాతం తగ్గిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వార్షిక క్రైమ్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. గంజాయి సాగు, మహిళల అక్రమ రవాణా, హత్య వంటి నేరాలు తగ్గినట్లు వెల్లడించారు. పిల్లల్లో అవగాహన పెరగడం వల్ల పాక్సో కేసులు స్వల్పంగా పెరిగాయని తెలిపారు. బాసర, నిర్మల్ వరద సహాయక చర్యల్లో జిల్లా పోలీసు శాఖ చురుకుగా సేవలందించిందని, శివంగి టీం సేవలు ప్రత్యేక గుర్తింపుకు నోచుకున్నాయని పేర్కొన్నారు. సున్నిత ప్రాంతాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో పాటు గణేశ్, దుర్గా నిమజ్జనాలు శాంతియుతంగా జరిగాయని వివరించారు.