ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డులో రైతులు మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. గత 15 రోజులుగా పంట అమ్మకానికి పడిగాపులు కాసినా, మార్క్‌ఫెడ్ అధికారులు ఇటీవల కొనుగోలు చేసిన పంటను గోదాములకు తరలించిన తర్వాత తిరస్కరించారు. దీంతో రైతులు తమ పంటను తిరిగి ఇళ్లకు మోసుకెళ్లాల్సి వచ్చింది. నిబంధనల పేరిట ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోళ్లు చేస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.