సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కనపర్తి
NEWS Dec 30,2025 03:00 pm
పెద్దపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షునిగా రాంపల్లి గ్రామ సర్పంచ్ కనపర్తి సంపత్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్‌లు ఆయనకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంపత్‌రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఏకగ్రీవంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.