భక్తాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
NEWS Dec 30,2025 02:59 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గట్టాయిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు వేణు అయ్యగారు తెలిపారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయగా, పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.