ఆటో బోల్తా, ముగ్గురు విద్యార్థులకు గాయాలు
NEWS Dec 30,2025 02:58 pm
లక్షెట్టిపేట మున్సిపాలిటీ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన విద్యార్థులు ఈ ఉదయం ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. సీఎస్ఐ రోడ్ వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో కడెం కెనాల్‌లో బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.