వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ప్రాచీన దేవాలయం దేవరకోటలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో నిలబడి వేచి చూశారు. ఆలయ ప్రాంగణంలో భజన బృందాలు ఆలపించిన భక్తిగీతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.