ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాల ఏర్పాటు
NEWS Dec 30,2025 12:12 am
ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న 25 జిల్లాలు 28కి చేరాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు నిర్ణయించారు. తుది గెజిట్ నోటిఫికేషన్ డిసెంబర్ 31న విడుదల కానుంది. అద్దంకిని బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాకు, రాజంపేటను కడపకు మార్చి, రైల్వేకోడూరు, సిద్ధవటం, ఒంటిమిట్టలను తిరుపతి జిల్లాలో చేర్చారు. మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.