ముక్కోటి ఏకాదశికి ఇలా చేస్తే మహా పుణ్యం
NEWS Dec 30,2025 12:08 am
వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు. ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి దర్శనం కల్పిస్తారు. క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం ఉద్భవించిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం అంటే కేవలం నిరాహారం కాదు – దైవానికి దగ్గరవ్వడం. బియ్యం తినకపోవడం, దుష్ట ఆలోచనలు విడనాడటం, జపం–పూజ–ధ్యానం చేయడం, ద్వాదశి నాడు అన్నదానం, బ్రాహ్మణ సత్కారం చేయడం వ్రత ప్రధాన నియమాలు. 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని 108 సార్లు జపించడం మహా పుణ్యఫలదాయకం.