తగ్గిన బంగారం ధరలు!
NEWS Dec 30,2025 12:02 am
డిసెంబర్ 29న భారత్‌లో బంగారం ధరలు గంటల్లోనే గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ఉదయం రూ.650 తగ్గగా, సాయంత్రానికి మొత్తం రూ.2,900 తగ్గింది. 24 క్యారెట్ల తులం ధర రూ.1,42,420 నుంచి రూ.1,39,250కు పడిపోవడంతో మొత్తం తగ్గుదల రూ.3,170గా నమోదైంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులో కొనసాగాయి. వెండి కూడా కిలోకు రూ.21,000 మేరకు భారీగా పడిపోయింది.