వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
NEWS Dec 29,2025 11:59 pm
వైకుంఠ ఏకాదశికి తిరుమల క్షేత్రం ప్రత్యేకంగా అలంకరించబడింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. డిసెంబర్ 30–జనవరి 1 వరకు కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ప్రవేశం. 50 టన్నుల పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 లక్షల కట్ ఫ్లవర్స్‌తో ఆలయ సుందరీకరణ చేపట్టారు. భక్తుల భద్రత కోసం 3 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. ఏకాదశి రోజున 70,000 మందికి దర్శనం అవకాశం ఉండనుంది.