తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ఉత్తర ద్వార దర్శనార్థం ఆయన తిరుమలకు విచ్చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహంలోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పుష్పగుచ్ఛం, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.