మెట్‌పల్లిలో వీధి కుక్కల పట్టివేత
NEWS Dec 29,2025 11:03 pm
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆదేశాల మేరకు స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టుకొని పట్టిన కుక్కలను ఎనిమల్ హెల్త్ సెంటర్‌కు తరలించి, ఆపరేషన్ అనంతరం తిరిగి వీధుల్లో వదిలిపెడతారు. నిత్యం వివిధ వార్డులలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ముజీబ్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.