సర్పంచ్‌ను సన్మానించిన తహసీల్దార్ రాజయ్య
NEWS Dec 29,2025 11:24 pm
హన్మంతునిపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్‌లను సోమవారం తహసీల్దార్ రాజయ్య శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“గ్రామ అభివృద్ధి పట్ల పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల పురోగతికి కృషి చేస్తే మాత్రమే గ్రామం ముందుకు సాగుతుంది” అని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ పాల్గొన్నారు.