పర్యావరణం కోసం నాయక్ ముందడుగు
NEWS Dec 29,2025 11:22 pm
పాల్వంచ: ప్రకృతిని కాపాడాలనే ధ్యేయంతో నిరంతరం మొక్కలు నాటి, పలువురు ప్రముఖులకు పచ్చని బహుమతులుగా మొక్కలను అందిస్తూ విశేష స్పందన పొందుతున్న ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ మరోసారి పచ్చదనానికి ప్రోత్సాహం ఇచ్చారు. పాల్వంచ కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి పలు మొక్కలను నాటారు. “పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రతి శుభకార్యం, పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాలలో ఒక్కో మొక్కను నాటితే, అది సమాజానికి నిజమైన కానుక అవుతుంది” అని ఆకాంక్షించారు.