ఏపీ మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు
NEWS Dec 29,2025 12:56 pm
AP CM చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో 20కి పైగా అజెండా అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేసి అన్నమయ్య జిల్లా పేరుతో ప్రకటించడం, రాయచోటిని మదనపల్లెకు, రాజంపేటను కడపకు, రైల్వేకోడూరును తిరుపతికి, గూడూరును నెల్లూరుకు మార్చే ప్రతిపాదనలు చర్చకు రావున్నాయి. ఆమోదమిస్తే ఆంధ్రప్రదేశ్ కొత్తగా 28 జిల్లాలుతో రూపుదిద్దుకోనుంది.