రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయిలు మృతి
NEWS Dec 29,2025 12:49 pm
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువతులు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన భావన (24) అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.