కేసీఆర్‌ను పలకరించిన రేవంత్
NEWS Dec 29,2025 12:45 pm
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభ్యులు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆయనకు పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.