బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
NEWS Dec 29,2025 12:38 pm
కథలాపూర్ మండలం తక్కలపెల్లి గ్రామ శివారులో బైక్ ప్రమాదంలో యువకుడు లోకేష్ (23) మృతి చెందినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి లోకేష్ తన అత్తగారి గ్రామం మోహన్‌రావుపేటకు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పిన బైక్ పొలంలోకి దూసుకెళ్లింది. అతివేగం కారణంగా తీవ్ర గాయాలపాలైన లోకేష్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య శ్వేత గాయపడి జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. లోకేష్ మృతదేహాన్ని కోరుట్లకు పోస్టుమార్టం కోసం పంపించారు.