కాంగ్రెస్ పార్టీలోకి విశ్వబ్రాహ్మణులు, యువకులు
NEWS Dec 29,2025 12:01 am
కథలాపూర్ మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ ప్రసాద్, యంగ్ స్టార్ యువ సభ్యులు, గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి పనులను చూస్తూ ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం పెంచుకుంటున్నారని అన్నారు. గ్రామం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, గ్రామ స్థాయి ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగరాజ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శేఖర్, చెదల సత్యనారాయణ, కస్తూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.