సిరికొండలో మాన్ కి బాత్ కార్యక్రమం
NEWS Dec 28,2025 11:44 pm
కథలాపూర్: సిరికొండ గ్రామంలో ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమూహంగా వీక్షించారు. దేశంలో గత నెలల్లో జరిగిన కీలక అంశాలపై ప్రధాని ప్రజలతో మాటలాడారు. జగిత్యాల కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు గోపి, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.