కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Dec 28,2025 11:55 pm
కథలాపూర్: కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, రాష్ట్ర చేనేత కార్యదర్శి పులి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1885 డిసెంబర్ 28న స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర సమరానికి పునాదులు వేసి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఏకైక జాతీయ పార్టీ అని నేతలు పేర్కొన్నారు.