మంత్రిని కలసిన ముల్లూరు గ్రామస్తులు
NEWS Dec 28,2025 11:41 pm
అల్లూరి జిల్లాలోని కునవరం (మం) ముల్లూరు గ్రామాన్ని 41 కాంటూరులో కలపాలని టీడీపీ మండల కోశాధికారి సోమక సత్యనారాయణ, గ్రామస్తులు కలిసి మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం సమర్పించారు. పోలవరం ముంపు ప్రభావిత గ్రామమైన ముల్లూరుకు 2009లో ఏకరకానికి రూ.1.15 లక్షలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు R&R లేదా స్టెక్కర్ వెలివేషన్ ప్రయోజనాలు అందలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం వరదలు గ్రామం, పొలాలు ముంచెత్తుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.