అభినవ శబరిమలగా పేరుపొందిన దండేపల్లి (మం) గూడెంగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో మహా మండల పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు పేద బ్రాహ్మణుల ద్వారా సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, అలంకరణతో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మహోత్సవానికి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ హాజరై స్వామి దర్శనం చేశారు. భజన బృందం ఆలపించిన అయ్యప్ప నామ సంకీర్తనతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది.