సర్పంచులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు.
NEWS Dec 28,2025 11:41 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో
జిల్లా కు చెందిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సర్పంచులను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అప్పుడే మీరు ప్రజా సేవలో మంచి పేరు తెచ్చుకోగలరు అని మంత్రి దిశా నిర్దేశం చేశారు.