జిల్లా అధికారి ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
NEWS Dec 27,2025 03:33 pm
జగిత్యాల జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం హఠాత్తుగా మృతి చెందారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేశారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంకితభావంతో పనిచేసిన బాధ్యతాయుత అధికారి శ్రీనివాస్ మరణం ఆరోగ్య విభాగానికి తీరని లోటు అని కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు.