అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
1,800కిపైగా విమానాలు రద్దు
NEWS Dec 27,2025 10:26 am
అమెరికాలో హాలిడే సీజన్ మధ్య ‘డెవిన్’ మంచు తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఈ తుపాను కారణంగా ప్రయాణ వ్యవస్థ దెబ్బతింటూ, దేశవ్యాప్తంగా 1,800కిపైగా విమానాలు రద్దయ్యాయి, వేల సంఖ్యలో ఆలస్యమవుతున్నాయి. న్యూయార్క్ జేఎఫ్‌కే, లాగ్వార్డియా, డెట్రాయిట్ మెట్రో వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ 2 కోట్ల మందికి పైగా వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసింది.