3,4,5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు
NEWS Dec 27,2025 09:53 am
AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.