వెలమామిడిని పంచాయతీగా ప్రకటించాలి
NEWS Dec 27,2025 10:14 am
అనంతగిరి మండలంలోని పెద్దకోట పంచాయతీని విభజించి, వేలమామిడి గ్రామంలో నూతనంగా పంచాయతీ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాడేరు గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. చుట్టుపక్కల 13 గ్రామాల నుంచి 2,000 పైగా జనాభా ఉన్నప్పటికీ, సరైన పరిపాలన అందకపోవడం వల్ల నిత్యజీవిత సమస్యలు ఎదురవుతున్నాయని గిరిజనులు తెలిపారు. వేలమామిడిని కేంద్రంగా చేసుకుని కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ ITDA ఎదుట నిరసన తెలిపారు.