డ్రగ్స్ ముఠాలో ప్రముఖ ఆస్పత్రి డాక్టర్లు?
NEWS Dec 26,2025 06:51 pm
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ రవాణా చేస్తూ ఉన్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లు, ఐదుగురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద డ్రగ్స్ విక్రయించే ప్రాంతంలో మేడ్చల్ SOT పోలీసులు ఎనిమిదిమందిని అరెస్ట్ చేసి, రూ.4 లక్షల విలువైన 70గ్రాముల MDMA, 2కార్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో ఈ చర్య చేపట్టారు.