న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను భారీ స్థాయిలో చేపట్టనున్నట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ తేజవత్ రామదాసు తెలిపారు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. డిసెంబర్ 31న మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ఫోకస్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. పర్మిషన్‌తో వేడుకలు జరుపుకోవడంలో అభ్యంతరం లేకపోయినా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.