ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్!
NEWS Dec 26,2025 11:49 pm
మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పారు. అసెంబ్లీ అనంతరం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించనుందని తెలిపారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ సీనియర్ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. నీటి హక్కులపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని మళ్లీ నిర్మించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.