సర్పంచులను సన్మానించిన మంత్రి జూపల్లి
NEWS Dec 26,2025 11:51 pm
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను శాలువాలతో అభినందించారు. గ్రామ పాలన ప్రజలకు చేరువ కావాలంటే సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని జూపల్లి తెలిపారు. పారదర్శక పాలన ప్రజల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.