కాంగ్రెస్ మద్దతు సర్పంచులకు సత్కారం
NEWS Dec 26,2025 11:50 pm
లక్ష్మిదేవిపల్లి మండల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన పలువురు సర్పంచులను పార్టీ రాష్ట్ర నాయకుడు తూము చౌదరి ఘనంగా సత్కరించారు. పెద్దతండ సర్పంచ్ లావుడియా పూర్ణ చందు లాల్, దుద్యతండ సర్పంచ్ బాణోత్ రమేష్, భావోజీ తండ సర్పంచ్ వాంకుడోత్ హతిరాం, హరియాతండ సర్పంచ్ గుగులోత్ బుజ్జిలను అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూణెం శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎండి గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.