ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం
NEWS Dec 26,2025 11:50 pm
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కథలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కయితీ నాగరాజ్ విమర్శించారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఇంచార్జ్ లక్ష్మీ నరసింహరావు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి తగవని అన్నారు. కుంటుపడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నాయకుడిపై దూషణలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, తెలంగాణ ఫిషర్మెన్ కార్యదర్శి గంగాధర్, సీనియర్ నేతలు కస్తూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.