ఆ ఊరిలో కాళ్లకు చెప్పులుంటే ₹5,000 ఫైన్
NEWS Dec 26,2025 03:14 pm
పుష్యమాసం ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి (M) తుమ్మగూడ ఆదివాసీ గ్రామంలో ప్రత్యేక ఆచారాలు అమల్లోకి వచ్చాయి. దేవతా సేవలో పవిత్రత కోసం గ్రామ పొలిమేర వద్ద గ్రామస్తులు హెచ్చరిక బోర్డులో చెప్పులు ఊరి బయటే విడిచిపెట్టాలని, చెప్పులు ధరించి గ్రామంలోకి వస్తే ₹5 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. నిబంధనలు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు అమల్లో ఉంటాయి. తరతరాల సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.