కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల ఆటో బోల్తా పడింది. ఆలయం నుంచి ఘాటు రోడ్డు దిగి వస్తుండగా ఆటో అదుపు తప్పి సైడ్‌వాల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. స్థానికులు సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.