భైంసాలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
NEWS Dec 26,2025 03:09 pm
భైంసా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు గత వారం రోజులుగా సమ్మెబాట పట్టారు. చాలీచాలని వేతనం, అది కూడా ప్రతి నెలా సకాలంలో అందకపోవడంతో పనులను బహిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కార్మికులకు అధిక వేతనాలు, బెనిఫిట్స్ ఉంటే, తమకు మాత్రం తక్కువ వేతనం, ఎలాంటి ప్రయోజనాలు లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, బెనిఫిట్స్ అమలు వంటి డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.