మళ్లీ స్పీడ్ అందుకున్న గోల్డ్ రేట్స్
NEWS Dec 26,2025 10:42 am
బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ఏకదాటిగా పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు కూడా తగ్గి సామాన్యులకు ఊరట ఇవ్వడం లేదు. శుక్రవారం గోల్డ్ రేట్లు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.39.260 వద్ద కొనసాగుతుండగా,22 క్యారెట్ల ధర రూ.1,27,660గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,39,260, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,660 వద్ద కొనసాగుతోంది.