పాన్ కార్డ్ ఫ్రీగా, నిమిషాల్లోనే..
NEWS Dec 26,2025 10:38 am
ఇప్పుడు పాన్ కార్డ్‌ను ఉచితంగా, కొన్ని నిమిషాల్లో, ఇంటి నుంచే పొందొచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఆధార్ ఆధారిత e-KYC ద్వారా ఇన్‌స్టంట్ పాన్ జారీ చేస్తోంది. దీంట్లో ఫారమ్‌లు, పత్రాల అప్‌లోడ్, ఫీజులు అవసరం లేదు. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే చాలు. అధికారిక IT వెబ్‌సైట్‌లో Instant PAN ఎంపికపై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి వచ్చిన OTPను ధృవీకరించాలి. వెంటనే e-PAN అవుతుంది, డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించొచ్చు.