ఘనంగా ‘TTA సేవా డేస్ 2025
NEWS Dec 26,2025 12:43 am
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ – 2025” విజయవంతంగా ముగిసింది. 2వారాల పాటు ఆరోగ్యం, విద్య, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు, వైద్య శిబిరాలు, సామగ్రి పంపిణీ, ఆలయాల పునర్నిర్మాణం, గచ్చిబౌలిలో 10K రన్, వృద్ధుల కోసం క్యారం ఛాంపియన్‌షిప్ నిర్వహణ వంటి కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. టీటీఏ మెగా కన్వెన్షన్ – 2026 జూలై 17–19 నార్త్ కరోలైనాలో జరగనున్నట్లు నాయకులు తెలిపారు.