అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి
NEWS Dec 26,2025 12:28 am
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు బేస్‌మెంట్‌లు, గ్రౌండ్‌తో పాటు 7 అంతస్తులు, మొత్తం 52 కోర్టు హాళ్లతో ఈ నిర్మాణం రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 45 వేల టన్నుల స్టీల్ వినియోగంతో 2027 నాటికి భవనం పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి వెల్లడించారు.