చోడవరం మండలం చాకిపల్లి గ్రామంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఆనందంగా నిర్వహించారు. దైవ సేవకుడు పాస్టర్ జాన్సన్ చుట్టుపక్కల ప్రాంతాల యేసు క్రీస్తు సంఘస్తులను ఏకం చేస్తూ దేవుని వాక్యాలు, ఆరాధనా గీతాల మధ్య భక్తులను నడిపించారు. ప్రేమ, ఏకత, సేవ భావాలను క్రైస్తవ సమాజం పాటించాలని పాస్టర్ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారు.