దండేపల్లి మండల కేంద్రంలో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎస్‌ఐ తహసీనొద్దీన్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు వృద్ధులు లబ్ధిపొందారు. శీతాకాలంలో చాలీచాలని దుప్పట్లు కారణంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.