భూషణరావుపేటలో క్రిస్మస్ వేడుకలు
NEWS Dec 26,2025 12:18 am
కథలాపూర్ మండలం భూషణరావుపేటలోని జీసస్ గుడ్ న్యూస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ గసికంటి సామ్యూల్ క్రిస్మస్ సందేశం అందిస్తూ.. దేవుడు ప్రేమ స్వరూపుడై శరీరధారిగా జన్మించాడని, ప్రేమ, త్యాగం, సమానత్వం ఆయన బోధనల మూల సారమని తెలిపారు. ఒకరినొకరు అహంకారం లేకుండా సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తులు ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు.